ప్రజాశక్తి-పర్చూరు: శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని, గుంటూరు వారి సహకారంతో చిన్మయా మిషన్, పర్చూరు వారు జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 360 మందికి కంటి శుక్లముల పరీక్షలు నిర్వహించగా, 262 మందిని శస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు. వీరిని శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా ప్రయాణం, భోజన వసతులతో శుక్లముల శస్త్ర చికిత్స నిర్వహిస్తారన్నారు. పాబోలు రాధాకృష్ణమూర్తి, ఇందిరాదేవి గార్ల జ్ఞాపకార్థం ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉదయ భాస్కర్ తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ షాయీజా, డాక్టర్ మెహబూబ్, పిఆర్‌ఓ నాగబాబు, సిబ్బంది వైద్య సేవలు అందించారు. శిబిరంలో కాసా అజయబాబు, కొసన వెంకటేశ్వర్లు, కటారి సత్యం, తాటి లింగేశ్వరరావు, గుండిమెడ ఆంజనేయరావు, కొత్తూరి వెంకటేశ్వరరావు, సుబ్బారావు, దుర్గ ప్రసాద్, రావి నాగయ్య, అమర్‌బాబు, శివరామ క్షిషణ, వూరా కాశీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.










