Mar 06,2023 00:55
టైప్‌ రైటింగ్‌ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి-రేపల్లె: టైప్‌ రైటింగ్‌ పరీక్షలు ఆదివారం స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలలో జరుగుతున్నాయని టైప్‌ రైటింగ్‌ ఎగ్జామినేషన్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రేపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో టైపు రైటింగ్‌ ఇంగ్లీష్‌ జూనియర్‌ గ్రేడ్‌కు 8 మంది, ఇంగ్లీషు లోయర్‌ గ్రేడ్‌కు 21 మందికిగాను 20 మంది, ఇంగ్లీష్‌ హయ్యర్‌ గ్రేడ్‌కు 17 మంది, మొత్తం 46 మందికి గాను, పరీక్షలకు 45 మంది హాజరయ్యారన్నారు. ఇంగ్లీష్‌ లోయర్‌కు ఒక్కరు ఆబ్సెంట్‌ అయ్యారని తెలిపారు.