Jul 08,2023 19:33

ధర్నా కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
కలెక్టరేట్‌ ఎదుట జరిగే 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. శనివారం 36 గంటల ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి రాముడు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు హెబ్సిబా రాణి, లూసమ్మ, వరలక్ష్మి, దేవి, భీమలింగమ్మ మాట్లాడారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ఈనెల 10, 11న కర్నూలు కలెక్టర్‌ ముందు జరిగే 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఉపయోగపడే పథకాలను క్రమేపి వారికి అందకుండా దూరం చేస్తోందని విమర్శించారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని తెలిపారు. వీరికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు.