మాచర్ల: అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10,11వ తేదీల్లో నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.మహేష్ పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక సిఐటియు కార్యా లయంలో అంగన్వాడీల సెక్టార్ లీడర్ల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలం గాణ కన్నా అదనంగా వేత నాలు ఇవ్వాలని, ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని, రిటైర్మెంట్ బెని ఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని, అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరపాలని తదితర హామీలే హామీలను వెంటనే అమలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజ నేయులు నాయక్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా, ఐసి డిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లను కుదించడానికి నూతన విద్యా విధానం తీసు కొచ్చిందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అను గుణంగా వేతనాలు పెంచడం లేదని మండిపడ్డారు.ఆందోళనలో మాచర్ల ప్రాజెక్టు అంగ న్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొని జయప్రదం చేయా లని పిలుపు నిచ్చారు. కార్య క్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మాచర్ల ప్రాజెక్టు కార్యదర్శి ఉషా, సెక్టార్ లీడర్లు పాల్గొన్నారు.










