Jul 09,2023 23:57

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యూనియన్‌ నాయకులు

పల్నాడు జిల్లా: అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టనున్న 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెపి మెటిల్డాదేవి, గుం టూరు మల్లేశ్వరి లు పిలుపు నిచ్చారు. స్థానిక పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను నిర్వీ ర్యం చేసే కుట్రలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో నిధులు కుదించగా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కంటే వేతనాలు ఎక్కువ ఇస్తామని ప్రకటించి అమలు చేయక పోగా మితిమీరిన రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నా రని అన్నారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని అంగన్వాడీలలో ఉన్న ఒంటరి మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు సొంత నిధులు వెచ్చించడం వలన అంగన్వాడీలకు సెంటర్ల నిర్వహణ భారంగా మారిందని చెప్పారు. సామర్థ్యం తక్కువ ఉన్న ఫోన్‌ లు ఇవ్వడం వలన యాప్‌ ద్వారా సక్రమంగా పని చేయడం లేదని, దీంతో అంగన్వాడీ లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఇటువంటి యాప్‌ లు తక్ష ణమే రద్దు చేయాలని డిమాండ్‌, అంగన్వాడీలకు వేత నంతో కూడిన వారాంతపు సెలవులు, మెడికల్‌ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 36 గంటల ధర్నాను నిర్వీ ర్యం చేసే కుట్రలలో భాగంగా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు ఫుడ్‌ కమిషన్‌ అధికారులు వస్తు న్నారని, సెలవులు పెట్టేందుకు వీలు లేదని సూపర్‌ వైజర్లు ఆంక్షలు విధించారని,ఎట్టి పరిస్థితు ల్లోనైనా 36 గంటల ధర్నాను విజయ వంతం చేస్తామని చెప్పారు. సోమవారం ఉదయం పది గంటల కల్లా ధర్నా చౌక్‌కు అంగన్వాడీలు హాజరుకావాలని అక్కడి నుండి ప్రదర్శనగా జిల్లా కలెక్టరేట్‌ వద్దకు వెళ్లి 36 గంటలు పాటు అక్కడే ధర్నా చేయనున్నట్లు వివరించారు. ఈ మహా ధర్నాలు అంగన్వాడీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నరసరావుపేట ప్రాజెక్ట్‌ కార్యదర్శి బి.నిర్మల, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి పాల్గొన్నారు.