Aug 26,2023 22:05

వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-నెల్లూరు :నారాయణ దంత వైద్య శాలలోని ఓరల్‌ మాక్సి లో ఫీషియల్‌ సర్జరీ విభాగంలో 3,500 దంత సంబంధిత శస్త్ర చికిత్సలు పూర్తి చేసినట్లు నారాయణ దంత వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అజరు రెజినాల్డ్‌ తెలిపారు. శనివారం ఇటీవలి కాలంలో శస్త్ర చికిత్సలు చేయించుకన్న వారితో కలసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అజరు రెజినాల్డ్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వలన కాని, నోటిలో ఏర్పడిన గడ్డలు కాని, పుట్టుకతో వచ్చే ముఖ, దంత సంబంధిత సమస్యలకు శస్త్ర చికిత్సలు అత్యంత అధునాతన పద్ధతులలో, సురక్షితంగా చేయగల సామర్థ్యం ఉన్న ఓరల్‌ మాక్సిల్లో ఫేషియల్‌ సర్జరీ విభాగం నారాయణ దంత వైద్యశాలలో అందుబాటులో వుందన్నారు. ఈ విభాగంలో అత్యంత నిష్ణాతులైన వైద్య బందం, అధునాతన యంత్ర పరికరములతో జిల్లాతో పాటు పరిసర ప్రాంత జిల్లాలలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఆధునిక యంత్ర పరికరాలు తమ వైద్యశాలలో ఉన్నాయన్నారు. ఓరల్‌ సర్జరీ విభాగధిపతి డాక్టర్‌ డి. సత్య కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వలన దవడ ఎముకలు విరగడం, నోటి క్యాన్సర్‌ గడ్డలు, పిల్లలకు గ్రహణ శూల, గ్రహణ మొర్రి. దవడలకు సంభంధించిన అన్ని రకముల శస్త్ర చికిత్సలు విజయవంతం గా చేస్తున్నట్లు తెలిపారు. అనేక మంది రోగులు అవగాహనలేమితో చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్ళడం, మరికొంత మంది వ్యాధి తీవ్రతతో చికిత్సల నిమిత్తం నారాయణ దంత వైద్యశాలకు రావడం చూస్తున్నా మన్నారు. నారాయణ మెడికల్‌ గ్రూప్‌ ఏజిఎం సి. హెచ్‌ భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ దంత వైద్యంలో 9 రకాల ప్రత్యేక విభాగాలతో పాటు, 92 మంది స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలు నారాయణ దంత వైద్యశాలలో అందుబాటులో వున్నాయన్నారు. నారాయణ దంత వైద్యశాల డీన్‌ డాక్టర్‌ నువ్వుల శివకుమార్‌, కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె. సునీల్‌ ఈ వి. కుమార్‌, ఓరల్‌ సర్జరీ వైద్య నిపు ణులు డాక్టర్‌. సత్య కుమార్‌, డాక్టర్‌ కిశోర్‌ కుమార్‌, డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, డాక్టర్‌ రమేష్‌ బాబు, డాక్టర్‌ హరిప్రియ . అరవింద్‌ రెడ్డి తది తరులు శస్త్ర చికిత్సలు చేయిం చుకొని పూర్తి ఆరోగ్య వంతులైన వారు పాల్గొన్నారు.