అన్న క్యాంటీన్లో అన్నం వడ్డిస్తున్న నరేంద్రవర్మ
ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్ల టిడిపి కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ అపూర్వ స్పందన లభిస్తోంది. తాజాగా బుధవారం 255వ రోజు జమ్ములపాలెం గ్రామానికి చెందిన కరణం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు యజ్ఞేశ్వరరావు-సునీత సహకారంతో 350 మంది పేదలకు అన్న వితరణ చేశారు. పేదల ఆకలితీర్చే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములై సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్రవర్మ ధన్యవాదాలు తెలియజేశారు.










