
ప్రజాశక్తి - గంపలగూడెం : 35 సంవత్సరాలు గుర్రం నారాయణరావు నిరంతర ప్రజా సేవలో కొనసాగారని పలువురు పేర్కొన్నారు. మండలంలోని పెద్ద కొమెర గ్రామ తొలి సర్పంచ్‌గా, గుర్రం నారాయణరావు గెలిచినట్లు ఆ గ్రామ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణరావు వరసగా ఐదుసార్లు సర్పంచ్‌గా గెలిచి, ప్రజలకు సేవ చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రాథమిక సహకార కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగినట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులుగా రైతులకు సేవలందించారు. అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్లానింగ్ బోర్డు డైరెక్టర్‌గా, నారాయణరావు విధులు నిర్వర్తించారు. గ్రామ సర్పంచ్ కాలంలో 150 మందికి మిగులు భూమిని ఎకరం చొప్పున పంపిణీ చేయించినట్లు గుర్తు చేశారు. గుర్రం నారాయణరావు లేని లోటు తీర్చలేనిదని నాయకులు వివరించారు.