ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌లైన్ పూర్తిగా తొలగించాలని మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహా ధర్నా ఆదివారం నాటికి 349వ రోజుకు చేరింది. పైపులైన్‌కు వ్యతిరేకంగా శిబిరం వద్ద మత్స్యకార నాయకులు పెద్దపెటున్న నినాదాలు చేశారు. హెటిరో కంపెనీ వ్యర్ధ జలాలు సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీతో తమ ఉనికి ప్రమాదకరంగా మారిందన్నారు. కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్ లైన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార జేఏసీ రాష్ట్ర విద్యార్ధి ప్రధాన కార్యదర్శి వాసి పిల్లి నూకరాజు, గోసల అంజి, కారె కోదండరావు, కోడకాశీ రావు, మైలపల్లి శివాజీ తదితరులు పాల్గొన్నారు.










