Nov 13,2022 00:04

ధర్నా చేస్తున్న మత్స్యకారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో పైప్‌లైన్‌ పూర్తిగా తొలగిం చాలని మత్స్యకార యువత డిమాండ్‌ చేశారు. మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహా ధర్నా శనివారం నాటికి 348వ రోజుకు చేరింది. పైపులైన్‌కు వ్యతిరేకంగా శిబిరం వద్ద మత్స్యకార యువత పెద్దపెటున్న నినాదాలు చేశారు. కంపెనీ వ్యర్థ జలాలు సముద్రంలోకి విడిచి పెట్టడంతో మత్స్య సంపద నశించి తమంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖపట్నం రూరల్‌ ప్రోగ్రాం కమిటీ మెంబర్‌ పిక్కి స్వామి, మైలపల్లి బాబ్జి, గోసాల స్వామి, మైలపల్లి గిరీష్‌, మైలపల్లి శివాజీ, కందాల నాగరాజు, చౌడపల్లి తాతాజీ పాల్గొన్నారు.