Nov 09,2022 23:28

ధర్నా చేపడుతున్న మత్స్యకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌లైన్‌ పూర్తిగా తొలగించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. హెటిరో పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహా ధర్నా బుధవారం నాటికి 344వ రోజుకు చేరింది. 344 రోజుల నుండి పైప్‌లైన్‌కి వ్యతిరేకంగా తామంతా ఆందోళన చేస్తున్నప్పటికీ నేటి వరకు సమస్య పరిష్కారానికి మార్గం చూపకపోవడం దారుణం అన్నారు. సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మత్స్యకారులంతా ఐక్యంగా కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం పైన మరింతగా ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు మైలపల్లి బాబ్జి, మైలపల్లి జాను, వాసపల్లి నూకరాజు, శ్రీను, గోసల అంజి, గోసల వెంకటేష్‌, చౌడేపల్లి రాజు, పిక్కి రమణ, కారే కోదండరావు, జనసేన పార్టీ విశాఖపట్నం (రూరల్‌) ప్రోగ్రాం కమిటీ మెంబర్‌ పిక్కి స్వామి పాల్గొన్నారు.