ప్రజాశక్తి -నక్కపల్లి : హెటిరో పైప్‌లైన్ పూర్తిగా తొలగించాలని మత్స్యకార జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు, మహాధర్నా ఆదివారం నాటికి 342వ రోజుకు చేరింది. ఆందోళన శిబిరం వద్ద మత్స్యకారులు పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు .కంపెనీ వ్యర్ధ జలాలు సముద్రం, ఉప్పుటేరులోకి వదలడం వలన మత్స్యసంపద నశించి, తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడడంతోపాటు పొట్టచేతబట్టుకుని పనుల కోసం వలస పోయే పరిస్థితులు ఉత్పన్నమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తాము 342 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంగానీ, అధికారులు గానీ సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం దారుణమన్నారు. సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎపి మత్స్యకార జెఎసి జిల్లా అధ్యక్షులు పిక్కి స్వామి, నాయకులు వాసపల్లి నూకరాజు, గోసల స్వామి, కోసల వెంకటేష్, మైలపల్లి శివ, శ్రీను ,చొక్కా గోపి పాల్గొన్నారు.










