Jul 26,2023 19:53

వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డాక్టర్‌ కె.పద్మావతి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఇటీవల చేపట్టిన సర్వేలో 34 మంది కుష్టు బాధితులను గుర్తించినట్లు పల్నాడు జిల్లా లెప్రసి టిబి - ఎయిడ్స్‌ నివారణాధికారి డాక్టర్‌ కె.పద్మావతి తెలిపారు. వారిని వెంటనే పరిశీలించి ఉధృతి పెరగకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు తన కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. అనుమానితులను ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించి నిర్దేశిత యాప్‌లో నమోదు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిస్టర్‌, రికార్డులను ఎప్పటికప్పుడు పరీశీలించాలని చెప్పారు. కుష్టుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. శరీరం మీద రంగు మారిన మచ్చలు, కళ్లు, కాళ్లు చేతుల్లో వైకల్యం ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చూపించాలన్నారు. మచ్చ రూపంలో ఉన్నప్పుడే వ్యాధిని నిర్ధారించి, చికిత్స తీసుకు ంటే వ్యాధి పూర్తిగా నయమవుతుందని చెప్పారు. తరచు సర్వేలు చేసి కేసులను త్వరగా నిర్ధారిస్తే వైకల్యం రాకుండా కాపాడొచ్చని సిబ్బందికి సూచించారు.