Jul 24,2023 22:11

బలిజిపేటలో ఎంఇఒకు వినతిని అందజేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

ప్రజాశక్తి - సీతంపేట : కనీసవేతనం ఇవ్వాలని, మెనూ ఛార్జీలు ఎంచాలని కోరుతూ మధ్యాహ్నభోజన కార్మికులు ఈనెల 31న కలెక్టరేట్‌ వద్ద ధర్నా తలపెట్టినట్టు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు తెలిపారు. ఈ మేరకు స్థానిక సిఐటియు కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.10వేలు వేతనం ఇవ్వాలి, ధరలకు అనుగుణంగా మోనూ ఛార్జీలు పెంచాలని తదితర సమస్యలపై ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఈ ధర్నాలో పెద్దఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.రోయిబారీ, కె.ఉష, ప్రియదర్శని, వి.చామంతి, ఎ.బుజ్జి, జె.సుధా సిఐటియు సీతంపేట మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు ఎస్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు వినతి
బలిజిపేట :తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు ఎంఇఒకు సోమవారం వినతిని అందజేశారు. ఈ సందర్బంగా మధ్యాహ్న భోజన కార్మికసంఘం నాయకులు భవానీ, యు.లక్ష్మి మాట్లాడుతూ ఈ పథకాన్ని 20ఏళ్లుగా నిర్వహిస్తున్న తమకు ఏ ప్రభుత్వం వచ్చిన మా సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. చాలీచాలని జీతంతో వెట్టిచాకిరి చేస్తున్నామన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, తొలగించిన తట్టుకోటి గణమ్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈనెల ఈనెల 31న కలెక్టరేట్‌ వద్ద ధర్నా జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం ఎంఇఒ ఎస్‌.సింహాచలంకు వినతిని అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మి, గౌరమ్మ, రూప, సంతు, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.