ప్రజాశక్తి - నూజివీడు రూరల్
ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన నూజివీడులోని శారదా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 14 కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరవుతాయని, ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.










