Jul 29,2023 23:41

మాట్లాడుతున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈనెల 31న చేపట్టనున్న చలో కలెక్టరేట్‌ ముట్టడిని మధ్యాహ్నం భోజన కార్మికులు జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనం రూ.26,000 వేలు ఇవ్వాలన్నారు. మెనూ చార్జీల బిల్లులు, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమాలు సిఐటియు మండల అధ్యక్షురాలు ఎస్‌ విజయమ్మ, మధ్యాహ్న భోజన కార్మికులు పి.రఘు, కే.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.