రాయచోటి : మండల పరిధిలోని చెన్న ముక్కపల్లె సమీపంలో ఉన్న లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 31 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని నియోజకవర్గంతో పాటు రాజంపేట, రైల్వే కోడూరు, కెవిపల్లె, యర్రావారిపాలెం, కలికిరి, కలకడ, గుర్రంకొండ, పెద్దమండెం, కదిరి, ఎన్.పి.కుంట, చక్రాయపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించారు. అర్హులైన 31 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. గతంలో ఆపరేషన్ చేయించుకున్న 40 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ వై.వి.ఆర్ స్వరూప గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు అన్వర్‌బాష, ఎపిఐఐసి డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, కంటి వైద్యులు సురేష్ బాబు, మహాలక్ష్మి,ఆప్త్మాలిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.










