Aug 27,2023 20:10

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు :ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 30 నుంచి నిర్వహించే సమరభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్‌లో ఆదివారం సమరభేరి వాల్‌పోస్టర్‌ను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూలం రమేష్‌ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో పాటు ప్రజలకు భారంగా మారిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, అధిక ధరలను తగ్గించాలని కోరుతూ ఈ నెల 30, 31 తేదీల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరించనున్నట్లు 1,2 తేదీల్లో సచివాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని సిపిఎం నిర్ణయించిందన్నారు. 4న మండల కేంద్రాల్లో ధర్నాలు ఉంటాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ,నిత్యవసర సరుకులను రేషన్‌ షాపుల ద్వారా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోస్టర్‌ ఆవిష్కరణలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె అజరుకుమార్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌కె మస్తాన్‌బీ, కందుకూరు సిపిఎం నాయకులు ఎస్‌ఎ గౌస,్‌ డి రామమ్మూర్తి ఎస్‌.కె మున్వర్‌ సుల్తానా పద్మ ఎస్‌ కె మల్లికా తదితరులు పాల్గొన్నారు.