30న సిపిఎం కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
- జయప్రదం చేయండి : సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వర్ రావు
ప్రజాశక్తి - ఆత్మకూరు
ఈనెల 30వ తేదీ సిపిఎం కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి సిపిఎం, ప్రజా సంఘాల కార్యకర్తలు నాయకులు, సానుభూతిపరులు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం సిపిఎం కార్యాలయంలో సిపిఎం నాయకులు కె భాస్కర్ రెడ్డి, పి వెంకటేశ్వర్లు, పి ఫకీర్ సాహెబ్, టి గోపాలకృష్ణతో కలిసి ఎం. నాగేశ్వర రావు విలేకరులతో మాట్లాడారు. సిపిఎం కార్యాలయము శంకుస్థాపన కార్యక్రమం ఈనెల 30వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు నందికొట్కూరు శ్రీనంది కాలేజీ సందులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలపై సిపిఎం నిత్యం పోరాటాలను చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమాలకు ఉపయోగపడే సిపిఎం నియోజకవర్గస్థాయి కార్యాలయ నిర్మాణ శంకుస్థాపనానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.










