Jun 27,2023 00:24

దుగ్గిరాలలో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నేతలు

దుగ్గిరాల: రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈనెల 30వ తేదీన విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను జయ ప్రదం చేయాలని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమ వారం పోస్టర్లను విడుదల చేశారు. ఈ ధర్నాకు రైతులు కౌ లు రైతులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోస్టర్‌ను ఆవిష్కరించిన వారిలో జెట్టి బాలరాజు ఎన్‌ యోగేశ్వర రావు వై బ్రహ్మేశ్వర రావు బి అమ్మిరెడ్డి తదితరులున్నారు. తెనాలి: ఈ నెల 30న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి కోరారు. రూరల్‌ గ్రామాలైన గుడివాడ, కొలకలూరు, ఎరుకలపూడి గ్రామాల్లో సోమ వారం సమా వేశాలు నిర్వహించి, రైతులు, కౌలు రైతులతో ఆయన మాట్లా ్లడారు. కౌలు రైతులకు గ్రామసభల ద్వారా గుర్తింపు కార్డు లివ్వాలని, ప్రభుత్వ పథకాలు వారికి అం దేలా చర్యలు తీస ుకోవాలని కోరారు. ఈ సందర్బంగా రైతులకు సాగు నీరందించేందుకు పెద వడ్లపూడి ఎత్తి పోతల పథకాన్ని ప్రారం భించాలన్నారు. కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో ఎరువులకు రూ.35 వేల కోట్లు తగ్గించడం ద్వారా ఖరీఫ్‌లో ఎరువుల ధరలు పెరుగు తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఖరీఫ్‌, రభీలో పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్‌ సబ్సిడి, పంటల బీమా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎం.సాంబశివరావు, జె. కోటేశ్వరావు, బి.సుధాకర్‌, కె.గగారిన్‌ పాల్గొన్నారు. తాడికొండ: ఈనెల 30వ తేదీన విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో కంచుమాటి అజరు కుమార్‌ బృం దం తాడికొండ మండలంలోని మోతాడక,నిడుముక్కల గ్రామాలలో ప్రచారం నిర్వహించి గోడిపతులను,కర పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజరు కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు రైతు సంఘం నాయకులు వద్ద వాపోయారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సిహెచ్‌ భాస్కరరావు, బాణావతి భద్రయ్య మనవ వెంక టేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.