Jun 28,2023 23:49

తాడేపల్లి: ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో వివిధ రకాల పెంచిన సర్‌ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30వ తేదీన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఎం, సిపిఐ నాయకులు తెలిపారు. బుధవారం తాడేపల్లి మేకా అమరా రెడ్డి భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిం చారు. విద్యుత్‌ భారాలను తగ్గించాలని కోరుతూ జరిగే ధర్నాలో ప్రజలు పాల్గొ నాలని పిలుపు నిచ్చారు. సీతానగరం పట్టాభి రామయ్య కాలనీ సబ్‌స్టేషన్‌, నులకపేట సబ్‌స్టేషన్‌ల వద్ద ధర్నాలు జరుగు తాయని తెలిపారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి వెంక టయ్య, కొట్టె కరుణాకరరావు, ఎస్‌.ముత్యాలరావు, డివి భాస్కర రెడ్డి, డి.శ్రీనివాసరావు, బిట్రా రామారావు పాల్గొన్నారు.