ప్రజాశక్తి - ఆదోని
పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 30న విద్యుత్ డివిజనల్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వెంకటేశులు, సీనియర్ నాయకులు ఈరన్న, సిపిఐ జిల్లా సమితి కార్యవర్గ సభ్యులు అజరు బాబు, పట్టణ కార్యదర్శి సుదర్శన్ కోరారు. బుధవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫిక్స్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, సర్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిపిఎం మండల కార్యదర్శి లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గసభ్యులు గోపాల్, తిప్పన్న, సిపిఐ మండల కార్యదర్శి రాజు, ఎంకప్ప, నాయకులు నాగరాజు, దస్తగిరి పాల్గొన్నారు. ఆలూరు జ్యోతిబసు భవన్‌లో గోడపత్రికలను విడుదల చేశారు. రైతుసంఘం మండల కార్యదర్శి అగ్రహారం ఈరన్న, నాయకులు కెపి.నారాయణస్వామి, వీరేష్, నాగరాజు, పరమేష్ గౌడ్, ఎం.వీరేష్, షేకన్న, నరసింహా పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఈరన్న










