Aug 20,2023 00:25

సత్తెనపల్లి రూరల్‌˜: రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 30వ తేదీన ఐదు లక్షల గృహ ప్రవేశాలే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ,ఇందుకు అవసరమైన అన్ని వసతులు, వనరులు కల్పించాలని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల లో జరుగుతున్న - జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను మంత్రి అంబటి రాంబాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ ఆర్చి , రహదారుల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. లే అవుట్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 2.3 కోట్ల నిధులు మంజూరు చేసిందని వీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ లేఅవుట్లలో 1149 గహాలు మంజూరు కాగా 316 గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు ఆయనకు వివరించారు. మంత్రి తో పాటు మున్సిపల్‌ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, రూరల్‌ మండల కన్వీనర్‌ రాయపాటి పురుషోత్తమ రావు, మున్సిపల్‌ కమిషనర్‌ కొలిమి షమ్మీ తదితరులు ఉన్నారు.
బిసి గర్జనను విజయవంతం చేయండి
సత్తెనపల్లి టౌన్‌ : ఈ నెల 22న నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బీసి గర్జనను బిసీ నేతలు వితయవంతం చేయాలని మంత్రి అంబటి రాంబాబు , ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. శనివారం వడ్డెర సంగనాయకులతో స్థానిక నియో జకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభలో వారు ముఖ్యనేతలు గా పాల్గొని మాట్లాడారు.