Sep 07,2023 22:38

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

        పుట్టపర్తి అర్బన్‌ : పెండింగ్‌లో ఉన్న భూ హక్కు పత్రాలను ఈనెల 30వ తేదీ లోపు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర పరిపాలన ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌పై విధంగా తెలిపారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ రీ సర్వే పూర్తిచేసిన గ్రామాల రైతులకు పెండింగ్‌లో ఉన్న భూపత్రాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. తదనంతరం రీ సర్వే చేసిన భూములకు భూహక్కు పత్రాలు ప్రింటింగ్‌కు పంపించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సర్వే రాళ్లు నాటే ప్రక్రియ నిర్ధేశించిన గడువులోపు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.