కలెక్టరేట్: ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా ప్లినరీ సమావేశాలు జులై 30, 31 తేదీల్లో సాలూరు పట్టణంలో జరుగుతుందని, ఈ సమావేశాలను విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్బంగా పండు, రాజశేఖర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభ దశ నుంచి విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలపై అధ్యాయం చేసి, నిర్ధిష్ట ప్రణాళికతో భవిష్యత్తులో విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా కార్యక్రమాలు రూపొందించనున్నట్టు తెలిపారు. ఈనెల 30, 31 రెండు రోజుల పాటు సాలూరులో జరుగు ప్లీనరీ సమావేశాలకు జిల్లా నలుమూలల నుంచి ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ సభ్యులు, జిల్లా, రాష్ట్ర నాయకత్వం హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.సింహాచలం, కె.భాస్కరరావు, శైలజ, హేమలత పాల్గొన్నారు.










