Sep 12,2023 21:03

మాట్లాడుతున్న డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి

కడప అర్బన్‌ : ఎల్‌ఐసి సిబ్బందికి 30 శాతం ఫ్యామిలీ పెంపు ఈనెల 11 నుంచి అమలు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్‌ విడుదల చేయడం హర్షణీయమని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం కడప డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సుధీకర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఎస్‌.అక్బర్‌ బాషా ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత ఇప్పటికి సాకారమయ్యిందన్నారు. సాధారణ బీమా సిబ్బందికి కూడా ఫ్యామిలీ పెన్షన్‌ పెంపు వర్తింపచేస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌ఐసిలో తొలిసారిగా 1997లో పెన్షన్‌ స్కీము సాధించిపెట్టిన యూనియన్‌ నేత ఎన్‌ ఎం సుందరం చిత్రపటానికి వారు పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎల్‌ఐసి ఉద్యోగుల పెన్షనర్ల సంఘాల నాయకులు అజరు కుమార్‌, అమీనా పర్వీన్‌, రాజు, నజీరుల్లా, కుమార్‌, శ్రీకష్ణ, వసుప్రద, శ్రీవాణి, జయచంద్ర, రఘు, ఎల్లయ్య, నరసయ్య పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రిని కలిసి ఎస్‌పి
ప్రజాశక్తి - కడప
కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ కౌశల్‌ మంగ ళవారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషాను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు యువ నా యకులు ఎస్‌. బి. అహమ్మద్‌ బాషా, ఉమైర్‌ పాల్గొన్నారు. ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ను డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం హాకీ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి సుభాన్‌బాషా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిమ్‌ సాహెబ్‌, రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఎస్‌సిని కలిసిన ఎన్‌జిఒ నాయకులు
కడప అర్బన్‌ : ఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించిన సిద్దార్థ కౌసిల్‌ను ఎపి ఎన్‌జిఒ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన్ను కలిసిన వారిలో ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బి. శ్రీని వాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షలు వై.ప్రసాద్‌ యాదవ్‌,జిల్లా కార్యదర్శి డి.రవికుమార్‌ ఉన్నారు.
పర్యావరణ సహిత ఆంధ్రప్రదేశ్‌ అందరి బాధ్యత
ప్రజాశక్తి - కడప
రాష్ట్రాన్ని పర్యావరణ సహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే బాధ్యత మన చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ముఖ్య కార్యనిర్వహకులు డాక్టర్‌ సమీర్‌ శర్మ ఆసుపత్రులు, ఫ్యాక్టరీ యాజమాన్యాలు, నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ విసి హాలులో పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని పలు ఆసుపత్రులు, అన్ని రకాల ఫ్యాక్టరీలు, ఫార్మసీటిక్‌ కంపెనీల యాజమాన్యాలు, పరిశ్రమల శాఖ, పర్యావరణ ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
పరిశీలన క్షుణ్ణంగా ఉండాలి
కడప : ఇంటింటికీ ఓటర్ల పరిశీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.మంగళవారం విజయవాడలోని ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయం నుండి ఃప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 2024ః కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలు నుంచి కలెక్టర్‌ వి.విజరు రామరాజు తోపాటు, డిఆర్వో గంగాధర గౌడ్‌ హాజరయ్యారు. విసి అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విధి విధానాల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపారు.
రక్తదాతలకు అవార్డులు పంపిణీ
ప్రజాశక్తి - కడప
కడప నగరంలోని ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాలలో హాండ్స్‌ 4 యు ఆధ్వర్యంలో రక్తదాతలకు మంగళవారం అవార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాండ్స్‌ 4 యు సంస్థ వ్యవస్థాపకులు సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి విలువైన ప్రాణాలను కాపాడాలని అన్నారు. కార్యక్రమానికి అతిధులుగా డాక్టర్‌ వారణాసి ప్రతాపరెడ్డి, నెహ్రు యువకేంద్రం జిల్లా అధికారి మణికంఠ, సిఆర్‌ఐ సునీల్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వీర సుదర్శన రెడ్డి చేతుల మీదుగా సంస్థ సభ్యులకు అవార్డులు అందజేశారు. కార్యక్రవ ుంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ నాగేంద్ర, ఇబ్బంది, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు తనిఖీ
ప్రజాశక్తి - కడప అర్బన్‌
యోగి వేమన విశ్వవిద్యాలయలో మంగళవారం మొదలైన డిగ్రీ కళాశాల ఇన్‌స్టంట్‌ పరీక్షలను వి సి ఆచార్య చింతా సుధాకర్‌ తనిఖీ చేశారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఎపిజె అబ్దుల్‌ కలాం కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. పరీక్షల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్‌. ఈశ్వరరెడ్డి విసి దష్టికి తెచ్చారు. విద్యార్థుల హాల్‌ టికెట్లను పరిశీలించారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని అదేశాలిచ్చారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 900 మంది విద్యార్థులు హాజరయ్యారని, 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరించారు.
ఃలీడర్‌షిప్‌ స్కిల్‌ః పుస్తకావిష్కరణ
ప్రజాశక్తి- కడప అర్బన్‌
నేటితరం యువతకు విద్యార్థులకు ఃలీడర్‌షిప్‌ స్కిల్స్‌ః పుస్తకం నాయకత్వ మార్గదర్శిగా నిలుస్తుందని యోగి వేమన విశ్వవిద్యాలయం విసి ఆచార్య చింతా సుధాకర్‌ అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌ ఆచార్య సామాను రఘునాథరెడ్డి రచించిన పుస్తకాన్ని విసి తన ఛాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ యువత వత్తిపరమైన నైపుణ్యాలను ఆకళింపు చేసుకుని, వారి వ్యక్తిత్వ అభివద్ధికి పుస్తకం పాటుపడుతుందన్నారు. వ్యక్తిత్వ వికాసం అనేది ఒక వ్యక్తి శారీరక, భావోద్వేగ, మేధోపరమైన కోణాలలో నిరంతర వద్ధిని జరుగుతుందన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నైతిక సూత్రాలు, నాయకత్వ లక్షణాలు, ఉన్నతమైన వ్యక్తిత్వం కోసం సహాయపడుతాయన్నారు. మేనేజ్మెంట్‌ విద్యార్థులకు ప్రయోజనకరం ఈ పుస్తమన్నారు. కార్యక్రమంలో ఐక్యూ ఎసి సంచాలకులు సుబ్రహ్మణ్య శర్మ, ఆచార్య ఎన్‌ సి గంగిరెడ్డి, ఆచార్య చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.