కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందించిన ఆలయ ఇఒ
ప్రజాశక్తి - ఏలూరు
ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరుకళ్యాణం మహోత్సవాలకు విచ్చేయాలని సంయుక్త కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధరావు గురువారం కలెక్టర్ ప్రసన్నవెంకటేష్‌ను ఆహ్వానించారు. స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ ఛాంబర్‌లో ప్రసన్నవెంకటేష్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు అందించారు. ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే ఏడో తేదీ వరకు స్వామివారి వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇఒ తెలిపారు. స్వామివారి కళ్యాణం మే 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు, మే 5వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు ఆలయ వేదపండితులతో వేద పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.










