Sep 21,2023 23:43

ప్రజాశక్తి-యు కొత్తపల్లి ఎన్నడూ లేని రీతిలో ఉప్పాడ సముద్ర తీరం 30 మీటర్ల వెనక్కి వెళ్ళింది. దీంతో సముద్ర తీర ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సముద్రం ఆటుపోటులు, తుపాన్లు, అమావాస్య, పౌర్ణమికి సముద్రం ముందుకు రావడం, మరల వెనక్కి వెళ్లడం జరుగుతూ ఉంటుంది.. ప్రస్తుతం అమావాస్య పౌర్ణమి ఎఫెక్ట్‌ తెలియదు కానీ ఊహించలేని రీతిలో 30 మీటర్ల పైబడి గురువారం సముద్రం వెనక్కి వెళ్ళింది. ఇంతలాగా ఎప్పుడూ చూడలేదని తీరప్రాంత వాసులు, బీచ్‌ సందర్శకులు చెబుతున్నారు. సుబ్బంపేట సమీపంలో అత్యంత సముద్రం వెనక్కి వెళ్ళింది. సముద్రం వెనక్కి వెళ్లడంపై, దేనికి సంకేతం అని ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరికొందరైతే సునామీలు సంభవించేటప్పుడే సముద్రం అలా వెనక్కి వెళ్తుందని చెబుతున్నారు. మరికొందరైతే సముద్రం ఆటుపోటులు వల్ల ఇలా జరుగుతుందని తెలుపుతున్నారు. సముద్రం అంత వెనక్కి వెళ్లడం ఇదే మొదటిసారని పలువురు తెలియజేస్తున్నారు.