30 లోపు ఎంఎల్‌సి ఓటర్ల తుది జాబితా :కలెక్టర్
ప్రజాశక్తి -తిరుపతి టౌన్
పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ ముసాయిదా జాబితా ఈసిఐ నిబంధనల మేరకు ఉండాలని కలెక్టర్ కే.వెంకట రమణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జే సి డి కే బాలాజీతో కలిసి శుక్రవారం జరిగిన ఎన్నికల వీడియో కాన్ఫరెన్స్ కు కొనసాగింపుగా ఎన్నికల సిబ్బంది, జే సి, జిల్లా విద్యా శాఖాధికారి, ప్రాంతీయ ఇంటర్మీడియట్ విద్యాధికారి వారితో ఏర్పాటు చేయబడిన పర్యవేక్షక కమిటీ ద్వారా పట్టభద్రుల నియోజక వర్గ, ఉపాధ్యాయ నియోజకవర్గ ముసాయిదా జాబితాలో దొర్లిన తప్పులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హత గలిగిన పేర్లను మాత్రమే తుది ఓటరు జాబితాలో ఉండేటట్లు చూడాలన్నారు. అదేవిధంగా విద్యార్హతలకు సంబంధించిన ధవ పత్రాల పరిశీలన నిబంధనల మేరకు ఉండేటట్లు చూసి నిర్దిష్ట సిఫార్సులను ఇవ్వాలని ఆదేశించారు.ఈనెల 30కల్లా ఎంఎల్‌సి తుది జాబితా ప్రచురించాలన్నారు. అలసత్వం వహించరాదన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ శ్రీనివాసరావు డి ఈ ఓ శేఖర్, ఆర్‌ఐఓ రమేష్ పాల్గొన్నారు.










