Nov 28,2022 23:52

గిడ్డంగిని పరిశీలిస్తున్న శివప్రసాద్‌

ప్రజాశక్తి-పాడేరు: ప్రధానమంత్రి గ్రామీణ కిశాన్‌ అన్న యోజన పధకం కింద ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యం పంపిణీని డిసెంబర్‌ మూడవ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా పౌర సరఫర అదికారి శివ ప్రసాద్‌ సోమవారం తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని తహసిల్దార్లు, పౌర సరఫరాల ఉప తహసిల్దార్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వారు ఉచిత బియ్యాన్ని పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రెగ్యులర్‌ అందిస్తున్న బియ్యం డిసెంబర్‌ ఒకటవ తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్‌ కోటాను ఈ నెల 30వ తేదీలోపు చౌక ధరల దుకాణదారులు సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా పలు చౌకధరల దుకాణాలను, గిడ్డంగులను డిఎస్‌ఓ తనిఖీ చేసారు.