ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అక్టోబర్ 16 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు న్యూ ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టులో విజయనగరం చెందిన ముగ్గురు వ్యాయామ ఉపాధ్యాయిని క్రీడాకారినులకు అవకాశం లభించింది. అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలో మొదటిసారిగా ఖోఖో పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టులో అవకాశం విజయనగరం క్రీడాకరీనిలకు లభించడం పట్ల జిల్లా కబడ్డీ మరియు ఖోఖో అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియచేసారు. ఎన్నో జాతీయస్థాయి క్రీడా పోటీలో పాల్గొని ప్రస్తుతం వ్యాయమ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ క్రీడాకారులని తయారీ చేస్తున్న కోనూరు వ్యాయమ ఉపాధ్యాయురాలు ఎస్ విజయలక్ష్మి, పెద్ద తాడివాడ వ్యాయమ ఉపాధ్యాయురాలు సి హెచ్. ఆదిలక్ష్మి, మెట్టపల్లి వ్యాయామ ఉపధ్యాయరాలు ఎస్ కనక మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ జట్టుకి సెలెక్ట్ అవ్వడం పట్ల జిల్లా క్రీడాకారులు, అసోసియేషన్ నాయకులు శుభాకాంక్షలు తెలియచేసారు.










