హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భారత పతకాల పంట కొనసాగుతోంది. షూటింగ్‌లో మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో చెనారు, జోరావర్ సింగ్, పృథ్వీరాజ్‌లు పసిడిని గెలుచుకున్నారు. మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో మనీషా, ప్రీతి, రాజేశ్వరి బృందం రజతంను గెలిచారు. గోల్ఫ్‌లో భారత్‌కు చరిత్రాత్మక పతకం దక్కింది. మహిళల వ్యక్తిగత విభాగంలో అదితి రజతం గెలుచుకున్నారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా అదితి నిలిచారు. కాగా ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 41కి చేరింది. స్వర్ణం- 11 రజతం- 16 కాంస్యం- 14 దక్కాయి.










