Sep 29,2023 23:25

ప్రజాశక్తి-రామచంద్రపురం
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ప్రతి ఒక్కరు శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రపరచాలని, స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం రామచంద్రపురం పురపాలక సంఘం కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ జయంతి పురస్కరించుకొని పట్టణంలో స్వచ్ఛత కార్యక్రమాలు భాగంగా శానిటరీ సిబ్బందితోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, అందరితో కలిసి ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ప్రధాన రహదారిలో ఇప్పటికే ఒకవైపు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచామన్నారు. రెండోవైపు డ్రైనేజీ పునర్‌ నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. పట్టణంలో ఎంతో కాలంగా అపరిష్కతంగా ఉన్న శ్మశాన వాటికను రూ.10 లక్షలతో అభివద్ధి పరిచామన్నారు. సెప్టెంబర్‌ 30 న రామచంద్రపురం పురపాలక సంఘం తో పాటు ద్రాక్షారామలో జగనన్న సురక్ష కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి రామచంద్రపురం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షత వహించారు. కమిషనర్‌ కె.శ్రీకాంత్‌ రెడ్డి అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జిల్లా కోర్టు సాధన కోసం వినతి
రామచంద్రపురం లో జిల్లా కోర్టు ఏర్పాటుకు మంత్రి వేణుగోపాల కృష్ణ సహకారం కోరుతూ రామచంద్రపురం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన వెంకటరమణ ఆధ్వర్యంలో న్యాయవాదులు వేణు స్వగహంలో కలిసి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రామచంద్రపురం లో జిల్లా కోర్టు బెంచ్‌ ఏర్పాటు ఆవశ్యకతను గురించి మంత్రి కి వారు వివరించారు. సిఎం జగన్‌ దష్టికి తీసుకెళ్లి త్వరలో జిల్లా కోర్టు ఏర్పాటుకు కషి చేస్తానని మంత్రి వేణుగోపాలకష్ణ హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వాడ్రేవు సాయి ప్రసాద్‌, సహాయ కార్యదర్శి చిన్నం వీర్రెడ్డి, మహిళా ప్రతినిధి కెవి.సత్యవాణి, మాజీ అధ్యక్షులు ఎస్‌.ఎస్‌. సుబ్రహ్మణ్యం, దోమ్మలపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.