ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆరగనైజేషన్ - అథ్లెటిక్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 2వ తేదీన నగరంలో అహింస రన్ నిర్వహించనున్నట్లు జీతో విజయవాడ చాప్టర్ చైర్మన్ అశోక్ గోలేచ అన్నారు. రన్‌కు సంబంధించిన పోస్టర్‌ని శుక్రవారం ఓ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రన్ మూడు కేటగరీలుగా 2వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో రన్ ప్రారంభమవుతుందని తెలిపారు. రన్‌లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి.టి.ఉష పాల్గొంటారని తెలిపారు. రన్‌లో విజేతలకు రూ.2 లక్షలు ప్రైజ్ మనీ అందజేస్తామన్నారు.










