పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు
29న విజయవాడలో మహాధర్నా
ప్రజాశక్తి-నెల్లూరు:దళితుల హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం, దళిత పేటల అభివద్ధి సమానత్వం కోసం ఈనెల 29వ తేదీ విజయవాడలో కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న మహా ధర్నాను జయప్రదం నాయకులు పిలుపు నిచ్చారు. శనివారం నగరంలోని కెవిపిఎస్ జిల్లా కార్యాలయంలో ఈ మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ మతోన్మాద విధానాన్ని వ్యతిరేకిస్తూ, భారత లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుతూ, జస్టిస్ పున్నయ్య గారి కమిటీ సిఫార్సులు అమలు చేయాలని , కోనేరు రంగారావు గారి కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ధర్నా నిర్వహించడం జరుగుతుందని ధర్నాలో, దళితులు వ్యవసాయ కార్మికులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేలపాటి రఘురామయ్య ఆలూరి తిరుపాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జే .వెంకమరాజు, మంగలి పుల్లయ్య, ప్రజా సంఘాల నాయకులు చండ్ర రాజగోపాల్, పి శ్రీరాములు మూలే వెంగ య్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.










