వినుకొండ: ఈ నెల 29వ తేదీన శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించ నున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్ రెడ్డి సోమవారం వినుకొండలోని కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కొండపై ఉన్న దేవాలయం, అఖండ జ్యోతి ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి తిరు నాళ్ళకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, తొక్కి సలాటలు జరగకుండా, సంబంధిత శాఖల అధికారుల సమ న్వయంతో బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల వారు సమిష్టిగా పనిచేసి ఈ తొలి ఏకాదశి తిరునాళ్ళ విజయవంతానికి కృషిి చేస్తామని అన్నారు. పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి, వాహనదారులకు పార్కింగ్ గురించి అవగాహన కల్పించాలని పోలీస్ అధికారు లకు సూచించారు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలు.. పోలీసులకు, అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, కౌన్సిలర్ షకీలా, చిన్నబ్బాయి తైతలు పాల్గొన్నారు.










