Oct 25,2023 21:32

బ్రోచర్లను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లా సమగ్రాభివృద్ధి- ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన జిల్లా స్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. బుధవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో ఇందుకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం రాంభూపాల్‌ మాట్లాడుతూ సెమినార్‌ను అనంతపురం తపోవనంలోని రేడియంట్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అభివద్ధి అంటే కొద్ది మంది వ్యక్తులు కుబేరులుగా మారి వారి సంపదను పెంచుకోవడమా..? లేక అత్యధిక ప్రజల జీవితాల్లో పురోగతి సాధించడమా? అని ప్రశ్నిస్తే ప్రజల అభివద్ధే నిజమైన అభివద్ధి అని అందరూ చెబుతారని తెలిపారు. తరతరాలుగా వెనుకబడిన జిల్లా ప్రజల అభివద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, నిధుల కేటాయింపులు, ఖర్చులు చేయాలని అనేక కమిటీలు సిఫార్సులు చేశాయని తెలిపారు. తద్వారా వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, ప్రభుత్వ విద్యా, వైద్యం, సామాజిక తరగతుల అభివద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించాయని తెలిపారు. కొత్త అనంతపురం జిల్లా ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతోందని, రాష్ట్రం చీలి ఒక దశాబ్దం దాటుతోందన్నారు. కానీ జిల్లా సమగ్రాభివద్ధి కోసం ప్రభుత్వాలు ఏమి చేయాలి? అనే అంశంపై ఒక్క సమీక్ష కూడా సమగ్రంగా జరగలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ప్రజల ఆకాంక్షలు ఏమిటీ? ప్రభుత్వాల ప్రాధాన్యతలో అనంతపురం జిల్లా ఎందుకని లేదు? అప్పర్‌భద్ర, కష్ణా, జలాల పున్ణపంపిణీపై జరుగుతున్న చర్చ సందర్భంలో అనంతపురం సాగునీటి పరిస్థితి ఏమిటీ? నూతనంగా జిల్లాలో ఒక్క పరిశ్రమ స్థాపించకుండా యువతకు ఉపాధి ఎలా కలిపిస్తారు? విద్యా, వైద్యం ఖరీదైన వ్యాపారంగా మారుస్తూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన ప్రజల భవిష్యత్‌ ఎలా అభివద్ధి చేస్తారు? వివిధ అంశాలపై చర్చించేందుకు సిపిఎం ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిష్ణాతులైన ప్రముఖులు సెమినార్‌కు హాజరవుతున్నారని తెలిపారు.
నాలుగు సెషన్లగా సెమినార్‌
నాలుగు సెషన్లగా జరిగే సెమినార్‌ను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అధ్యక్షతన 29వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని రాంభూపాల్‌ తెలిపారు. కీలక ఉపన్యాసకులుగా కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ పురేంద్రప్రసాద్‌ హాజరవుతున్నట్లు తెలిపారు. ముఖ్యవక్తగా ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు వ్యవసాయం- నీటిపారుదల అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు. ఈయన జిల్లాలో నీటి ప్రాజెక్టులు - ప్రస్తుతస్థితి - సాగునీటి అభివద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడతారని తెలిపారు. ఎస్‌ఎం.బాషా నీటి రంగ నిపుణులు. జిల్లాలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు - ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ప్రసంగిస్తారని తెలిపారు.
రెండవ సెషన్‌ పరిశ్రమలు- ఉపాధి
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు - ప్రభుత్వాల బాధ్యత

       అనే అంశంపై ఎస్‌ఐడిబిఐ ప్రాజెక్టు మెనేజర్‌ ప్రొఫెసర్‌ ఎండి.బావయ్య హాజరవుతున్నట్లు తెలిపారు. ఐటి ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు - ఆటంకాలు అనే అంశంపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాస్ట్రో కిరణ్‌ మాట్లాడతారని తెలిపారు. మూడవ సెషన్‌ సామాజిక తరగతులు - అభివద్ధి - ఆటంకాలు జిల్లాలో సామాజిక తరగతుల వెనుకబాటు- అభివద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజా పర్యవేక్షణ కమిటీ కన్వీనర్‌ సత్యబోస్‌ జిల్లాలో వలసలు- సామాజిక సమస్యలు అనే అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు. మహిళలు-వ్యవసాయం-సామాజిక సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాలు-పోటీపరీక్షలు-సామాజిక సమస్యలు అనే అంశంపై విద్యావేత్త ఎం.ఇలియాజ్‌, సామాజిక వేత్త శ్రీమతి ప్రసంగిస్తారని తెలిపారు. నాల్గవ సెషన్‌ విద్యా వైద్యం జిల్లాలో విద్యారంగం పరిస్థితి ప్రభుత్వ విద్య ఆవశ్యకత జిల్లాలో వైద్యంపై మానవ హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌ ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజల పరిస్థితి ప్రభుత్వ వైద్యం ఆవశ్యకత అంశంపై ప్రజావైద్యులు డాక్టర్‌ పి.ప్రసూన ప్రసంగిస్తారని తెలిపారు. అనంతపురం జిల్లా సమగ్రాభివద్ధి కోసం ప్రత్యామ్నాయ విధానాల కోసం నిర్వహిస్తున్న సెమినార్‌కు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాలరంగయ్య, ఎస్‌.నాగేంద్ర కుమార్‌, జిల్లా కమిటీ సభ్యురాలు ఎం.నాగమణి తదితరులు పాల్గొన్నారు.