ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్భాష్, దూదేకుల కులస్థుల గుంటూరులో ఈనెల 29 ఆదివారం జరిగే సింహగ్జన సభను విజయవంతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాకార్యదర్శి గురువారం షకీల్ అహ్మద్ ఓ సమావేశంలో కోరారు. దూదేకుల కులస్థులు రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్నా ఇంకా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి ద్వారా ఆదుకోవాలని ఆమె కోరారు. అలాగే ప్రతి పార్టీ జిల్లాకు ఒక శాసనసభ సీటు ఇవ్వాలని డిమాడ్ చేశారు. అనంతరం గోడ పత్రికను విడుదల చేశారు. చిత్తూరు మండల ప్రధాకార్యదర్శి మునీర్ అహ్మద్, కోశాధికారి మహమ్మద్ గఫూర్,జిల్లా సభ్యులు సుభాన్ సాహెబ్, బషీర్ అహ్మద్, ముక్తార్, రియాజ్, మసూద్, జగదీష్, బాబు పాల్గొన్నారు.










