
ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కు పరిరక్షణకు సిపిఎం చేపట్టిన బైక్ ర్యాలీ, ఈ నెల 29న చేపట్టే బహిరంగసభకు ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు జి.శ్రీనివాసరావు అధ్యక్షతన ఎల్‌ఎంఎం పార్కులో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 947 రోజులుగా పోరాటం చేస్తున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. సిపిఎం చేపట్టిన బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నమ్మి రమణ, చట్టి నర్సింగరావు, నాగరాజు, పిట్ట రెడ్డి, శశిభూషణ్, సత్యారావు, ఉరుకూటి అప్పారావు, పి.పెంటారావు, వేణు, ఉమ్మడి అప్పారావు, త్రినాథ్‌రెడ్డి, భాస్కరరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.