Oct 26,2023 19:59

మాట్లాడుతున్న ఎడిఎ సునీత

ప్రజాశక్తి-ఆలూరు
రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను ఈ-క్రాప్‌ చేయని వారు ఈనెల 29లోపు చేయించుకోవాలని ఎడిఎ సునీత తెలిపారు. గురువారం ఆలూరు ఆర్‌బికె-1లో గ్రామసభ, పంట నమోదు జాబితా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పట్టణ, గ్రామ ఆర్‌బికెలలో ఈ-క్రాప్‌ నమోదు చేసుకున్న వారి వివరాలను నోటీసు బోర్డులో పొందు పరచాలని ఆర్‌బికె సిబ్బందికి సూచించారు. ఇంకా నమోదు చేయని రైతులు ఈనెల 29లోపు రాతపూర్వకంగా స్థానిక రైతు భరోసా కేంద్రంలో ఇవ్వాలని తెలిపారు. ఎఒ వెంకటేష్‌ గౌడ్‌, ఆర్‌బికె సిబ్బంది పాల్గొన్నారు.