గాయకుడు శ్రీరామచంద్ర, గాయత్రి చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'పాపం పసివాడు'. వీకెండ్ షో బ్యానర్‌పై ఇది తెరకెక్కింది. దీని ట్రైలర్‌ను దర్శకుడు సందీప్ రాజ్ విడుదల చేశారు. ఆహా వేదికగా ఈనెల 29 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ విడుదలలో దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడారు. ప్రేమ, వినోదం ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుందని అన్నారు. ఆహాతోనే తన కెరీర్ ప్రారంభమైందని శ్రీరామచంద్ర తెలిపారు. 'ఆహాతో కలిసి పనిచేయడం ఇది మూడోసారి. ఇక్కడే యాంకర్‌గా నా జర్నీ మొదలు పెట్టిన నేను.. ఇప్పుడు 'పాపం పసివాడు'తో యాక్టర్‌గా మారాను. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందరూ ఎంజారు చేస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు.










