Aug 04,2023 00:39

దీక్ష చేపడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి-కోటవురట్ల: అణుకు గిరిజన ప్రాంతానికి పాఠశాల, రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు అప్పలరాజు మాట్లాడుతూ, అణుకు గ్రామ విద్యార్థులకు ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు చేసి విద్యా వాలంటీర్ను ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ప్రధానంగా రహదారి సౌకర్యం కల్పించే వరకు దీక్షను విరమించేది లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, సిపిఎం నాయకులు డేవిడ్‌ రాజు పాల్గొన్నారు.
అణుకు గిరిజనులకు మండల యూటీఎఫ్‌ అధ్యక్షులు జవ్వాది నర్సింగరావు ఆధ్వర్యంలో దీక్షలో పాల్గొన్న గిరిజనులకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారికి నితాత్యవసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.