Oct 24,2023 21:22

ప్రజాశక్తి - ఉంగుటూరు
   టిడిపి అధిష్టానం పిలుపు మేరకు ఈనెల 28న ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నారాయణపురంలో నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం ఆపార్టీ నాయకులతో ఏలూరు పార్లమెంటరీ టిడిపి గన్ని వీరాంజనే యులు సమాయత్త ఏర్పాట్లు, ఇతర అంశాలపై సమీక్షించారు. స్థానిక లయన్స్‌ క్లబ్‌ ఎదురుగా రంగరాజు పెట్రోలు బంకు ఆవరణలో సమావేశానికి అనువైన ప్రాంగణాన్ని గుర్తించారు. మండల ముఖ్యనాయకులు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు సప్పా వీరబాబు, మండల కార్యదర్శి నల్లా ఆనంద్‌, దిడ్ల శ్రీను, మారిశెట్టి ప్రసాద్‌, సింగులూరి రామకృష్ణ, గురువెళ్లి రాజారావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.