ప్రజాశక్తి - భట్టిప్రోలు
విజయవాడ దాసరి భవనంలో ఈనెల 28న చేతుదారుల సమైక్య సంఘ సమావేశం జరుగుతుందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టుముక్కల బాలాజీ తెలిపారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకుల విధానాల కారణంగా చేతి వృత్తుదారులు ఉపాధి కోల్పోయి వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. వృత్తి పనుల్లో సరైన పని లేక పస్తులు ఉంటున్నారని అన్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన విధివిధానాలను సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశానికి సిపిఐ రాష్ట్ర నాయకులు జెవి సత్యనారాయణ, కె రామాంజనేయులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో వృత్తి సంఘం నాయకులు బి శ్రీనివాసరావు, వి శ్రీనివాసరావు పాల్గొన్నారు.










