కిట్లు అందజేస్తున్న ఎఎస్‌డిఎస్ సంస్థ ప్రతినిధులు
ప్రజాశక్తి -విఆర్.పురం : మండలంలోని గుర్రంపేట, నూతిగూడెం గ్రామాల ప్రజలకు ఎఎస్‌డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గూంజు సంస్థ సహకారంతో 288 మందికి రూ.మూడు లక్షల విలువైన నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. సంస్థ . కోఆర్డినేటర్ వి.హరిబాబు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ వెట్టి లక్మి, ఎంపిటిసి పునేం ప్రదీప్ వీటిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక్కో కిట్‌లో రూ.1,050 విలువైన 10కిలోల సన్న బియ్యం, రెండు జతల చెప్పులు, టీ పొడి, దోమ తెర, పప్పులు, కారం, పసుపు ప్యాకెట్లు, దుప్పట్లు, దిండ్లు తదితర వస్తువులు వుంటాయన్నారు. ఈ సందర్భంగా తమకు కిట్లు అందజేసిన ఎఎస్‌డిఎస్ సంస్థ అధినేత వి.గాంధీబాబుకు గ్రామస్తులు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.










