ప్రజాశక్తి-పెదబయలు:మండలకేంద్రంలో సీతగుంట పంచాయతీ వారపు సంతలో 280 కేజీల గంజాయి పట్టుబడినట్లు స్థానిక ఎస్‌ఐ పులి మనోజ్ కుమార్ సోమవారం విలేకర్లకు తెెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీతగుంట జంక్షన్ వద్ద తమ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ముందుగా పల్సర్ బైక్ (ఫైలెట్ )గా వెనకాల జీపులో 280 కేజీల గంజాయి రావాణా చేస్తున్నారని తెలిపారు. అనుమానం వచ్చి పల్సర్ బైక్ ఆపడంతో వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు.ఇది గమనించిన జీప్ డ్రైవర్ దారి మళ్లించడానికి ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. నిందితుల్లో ఒకరు మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇంజారి పంచాయతీ మల్లెపూట్టు గ్రామ వ్యక్తిగా గుర్తించారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన ఒండ్రాగెడ్డ గ్రామానికి చెందిన మరోకరిని గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు జి.మాడుగుల సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ పులి మనోజ్ కుమార్ తెలిపారు.










