ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు అమలు, లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ ఈ నెల 27న విజయవాడలోని యంబి విజ్ఞాన కేంద్రంలో జరుగునున్న రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. కొండపల్లి పారిశ్రామికవాడ హెచ్‌పిసి యల్ ఆయిల్ ట్ర క్ టెర్మినల్ ఒప్పంద కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే విధం గా రూపొందించబడిన లేబర్‌కోడ్స్‌ను రద్దు చేసే వరకు వివిధ రూపాలలో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు రాజశేఖర్ శేఖర్ చెన్నరావు జయరాజ్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ప్రెసిడెంట్ సుందరరావు పాల్గొన్నారు.










