Feb 25,2023 23:40

కరపత్రాలను పంచుతున్న అసోసియేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి మాధవధార : విశాఖపట్నం పోర్ట్‌ట్రస్ట్‌పై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం హార్బర్‌ అండ్‌ పోర్ట్‌ పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 27న, సోమవారం గోల్డెన్‌ జూబ్లీ హాస్పిటల్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ చైర్మన్‌ సనపల బంగారురాజు, అధ్యక్షులు చౌదరి అప్పారావు తెలిపారు. ధర్నాలో హార్బర్‌ అండ్‌ పోర్టు పెన్షనర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ మేరకు శనివారం మురళీనగర్‌, మాధవధార, కళింగనగర్‌, తెన్నేటి నగర్‌ తదితర ప్రాంతాల్లోని పెన్షనర్లకు కలిసి, ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి పిఎస్‌ ప్రకాశరావు, కోశాధికారి అన్నపు నారాయణరావు, కె.గణేష్‌, పి.రామారావు పాల్గొన్నారు.