ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి సెప్టెంబర్ 8 వరకు జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు పిలుపుని చ్చారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించగా నాగేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టే యాత్ర ఈ నెల 27న నాదెండ్ల మండలం సాతులూరుకు చేరుకుంటుందని చెప్పారు. యాత్రకు ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ప్రాంతాల్లోని శ్రేణులు తరలిరావాలన్నారు. నరసరావుపేటలో రోడ్డు షో, వినకొండలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఎస్.కె హుస్సేన్, కె.రాంబాబు, బి.శ్రీనివాసరావు, కె.శరత్, బి.రామకృష్ణ, ఎం.శ్రీనివాసరావు, సిహెచ్ సత్యనారాయణరాజు, ఎన్.రామసుబ్బాయమ్మ, సుభాని, సుబ్బారావు, వెంకట్, చిన్నసైదా, బాబురావు, వాగ్యా నాయక్ పాల్గొన్నారు.










