Feb 25,2023 01:32
ధర్నా కరపత్రాలను ఆవిష్కరిస్తున్న వికలాంగుల సంఘం నాయకులు

ప్రజాశక్తి-రేపల్లె: బాపట్ల జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 27న జరుగు దివ్యాంగుల మహాధర్నాను జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షుడు కొమ్మూరి రాధాకృష్ణమూర్తి కోరారు. రేపల్లె టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు, వికలాం గుల పెన్షన్‌ 3000 నుంచి 5 వేలు చేయాలని, ఎటువంటి షరతులు లేకుండా వివాహ బహుమతి పథకం అమలు చేయాలని, త్రిచక్ర మోటార్‌ సైకిల్‌ ఇవ్వాలని, వికలాంగులకు బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఇవ్వాలని, 2016 నాటి వికలాంగుల చట్టం అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 27న బాపట్ల కొత్త బస్టాండ్‌ పక్కన గల ధర్నా చౌక్‌ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వికలాంగులు హాజరుకావాలని రాధాకృష్ణమూర్తి కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ వికలాంగుల కమిటీ అధ్యక్షుడు అద్దంకి అబ్రహాం, ప్రధాన కార్యదర్శి మంచాల స్టాలిన్‌, వికలాంగుల నాయకులు సనకా వెంకట్రామయ్య, మత్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.